అశ్వగంధ ప్రయోజనములు మరియు వాడు విధానం అశ్వగంధ ఆయుర్వేదం వైద్యం లో చాలా ముఖ్యమైనది . దీనిని " king of Ayurveda" అంటారు. దీనిని తెలుగులో పెన్నేరుగడ్డ , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అనీ వ్యవహరిస్తూవుంటారు. దీని వేరు, ఆకులు, పండ్లు, విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు. ప్రయోజనములు : ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు. అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొప్పులకు మరియు వెూకాలు నొప్పులకు ఇది మంచి ఔషధం. దీని ఆకులు, వేర్ల...